Header Banner

మద్యం స్కామ్’లో కీలక మలుపు! మరో కీలక నిందితుడి అరెస్ట్‌.. వైసీపీ నెట్‌వర్క్‌కి ఉచ్చు బిగుస్తుందా?

  Thu Apr 24, 2025 06:58        Politics

మద్యం స్కామ్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) మరో నిందితుడిని అరెస్టు చేసింది. మద్యం కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము వసూలు చేసి క్యాష్‌ హ్యాండ్లర్లు, కొరియర్ల ద్వారా చేర్చాల్సిన చోటుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన బూనేటి ప్రకాశ్‌ అలియాస్‌ చాణక్యను అరెస్టు చేశారు. మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి (ఏ1) తోడల్లుడే ఈ చాణక్య! ఆయనను మద్యం కేసులో ఏ8గా చేర్చారు. జగన్‌ హయాంలో ఆర్డర్లు ఎక్కువగా పొందిన మద్యం కంపెనీల నుంచి ‘లెక్క’ ప్రకారం కమీషన్లను తీసుకుని, ఆ కరెన్సీని అట్ట పెట్టెల్లో తీసుకెళ్లడం.. క్యాష్‌ హ్యాండ్లర్స్‌ ద్వారా కొరియర్లకు చేర్చడం.. తర్వాత షెల్‌ కంపెనీలు, స్థిరాస్తి వ్యాపార ఖాతాల్లో జమ చేయడం.. వారాంతంలో రాజ్‌ కసిరెడ్డికి లెక్క చెప్పడం.. చైతన్య పని. దిలీప్‌ రెడ్డి, కిరణ్‌ అనే మరో ఇద్దరితో కలిపి నగదు రవాణాలో బాధ్యతలు నిర్వహించారు. బేవరేజెస్‌ నుంచి ముడుపులు అందిన వెంటనే రాజ్‌ సూచించిన హవాలా ప్రతినిధులకు ముంబై, ఢిల్లీలో నగదు అందజేసేవారని సమాచారం. తర్వాత ఆర్గనైజ్డ్‌ హవాలా నెట్‌వర్క్‌ ద్వారా ఈ ముడుపులను షెల్‌ కంపెనీల్లోకి, స్థిరాస్తి వ్యాపారాల్లోకి మళ్లించే ప్రక్రియను పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో మొబైల్‌ ఫోన్లు, సిమ్‌లను తరచూ మార్చేవారని.. ముడుపులకు సంబంధించిన చర్చలకు వాట్సాప్‌, సిగ్నల్‌ వంటి యాప్‌లను ఉపయోగించారని ‘సిట్‌’ గుర్తించింది.

దుబాయ్‌కి చెక్కేసి...
ఐదేళ్లపాటు వేల కోట్ల మద్యం కమీషన్లు ‘హ్యాండిల్‌’ చేసిన చాణక్య... రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే దుబాయ్‌ విమానం ఎక్కేశారు. ‘సిట్‌’ అధికారులు మద్యం వ్యాపారుల్ని పిలిచి ప్రశ్నించే క్రమంలో ఆయన పాత్ర వెలుగులోకి వచ్చింది. డిస్టిలరీలు, మద్యం కంపెనీల ప్రతినిధులతో చాణక్య నిత్యం టచ్‌లో ఉంటూ... కమీషన్ల డబ్బులు తీసుకెళ్లేవారని నిర్ధారించుకున్నారు. సంబంధిత ఆధారాలు కూడా సేకరించారు. చాణక్య దుబాయ్‌లో తిష్ఠ వేసినట్లు గుర్తించారు. అక్కడి నుంచే వీపీఎన్‌, వీవోఐపీ సర్వీసులతోపాటు వాట్సాప్‌ ద్వారా ఇక్కడి ‘సహచరుల’తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. తన తోడల్లుడు రాజ్‌ కసిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం, హైదరాబాద్‌లో సోదాలు, రాజ్‌ తండ్రి ఉపేందర్‌ రెడ్డిని విచారించడం వంటి చర్యలతో... ఎప్పటికైనా తనకూ ఇబ్బంది తప్పదని రెండు రోజుల క్రితం చాణక్య హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలిసింది. కోర్టు ద్వారా రక్షణ పొందేందుకు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతుండగానే... సిట్‌ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చాణక్యను గురువారం విజయవాడ కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశముంది.

‘హవాలా’ నెట్‌వర్క్‌తో వైసీపీ నేతలకు లింకు..
మద్యం ముడుపుల సొమ్మును హవాలా రూపంలోకి మార్చిన ఆర్గనైజ్డ్‌ నెట్‌వర్క్‌తో కొందరు వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాణక్యను ప్రశ్నించిన సిట్‌ అధికారులకు ఈ కీలక సమాచారం అందడంతో ఆ దిశగా దర్యాప్తు అడుగులు పడుతున్నాయి. కేసు కొలిక్కి వచ్చే సమయానికి వైసీపీలోని కొందరు కీలక నేతలకు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురుదెబ్బ! దాడి కేసులో కీలక మలుపు! మళ్ళీ విచారణలో...

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LiquorScam #YSRCPNetwork #CorruptionExposed #HawalaScam #PoliticalScandal #SITInvestigation